'నీతి, నిజాయితీకి మారు పేరు అని చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడేం సమాధానం చెబుతారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో బాబు ఘనుడు.. ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు' అన్న గిరి.అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్. ఇప్పటి వరకు బయటకు వచ్చినవి చాలా తక్కువని.. ఇంకా పెద్ద కుంభకోణాలు చాలా ఉన్నాయన్నారు. త్వరలోనే అవన్నీ కూడా బయటపడతాయి అన్నారు. ఐటీ అధికారులు నిర్వహించిన సోదాల్లో బాబు, ఆయన సన్నిహితుల అవినీతి బండారం బట్టబయలు అయ్యిందన్నారు. ఐటీ సోదాలపై స్పందించిన గిరిధర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.